మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. తాజాగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ సినిమా నుంచి విశ్వక్‌సేన్ కొత్త లుక్‌ను విడుదల చేశారు. కాగా, పోస్టర్ చూస్తుంటే సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 9కి ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా.. మార్చి 8న రిలీజ్ కానుంది.
