తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’. ఈ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల కాగా.. ప్రేక్షకుల నుంచి ఎంతగానో ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ కొనసాగుతోంది. తాజాగా మేకర్స్ మరో కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్‌తో పాటు ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ అమీర్ ఉన్నారు.
