సంక్రాంతి పండుగకు మెగా ఫ్యామిలీ అంతా ఒకేచోట చేరి సందడి చేశారు. కొణిదెల ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ సభ్యులు బెంగళూరులోని ఓ రిసార్ట్ కు చేరుకొని చిల్ అయ్యారు. తాజాగా ఫ్యామిలీ అంతా కలిసి దిగిన గ్రూప్ ఫొటోను మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ లో షేర్ చేశారు. ‘పాడి పంటల, భోగ భాగ్యాల ఈ సంక్రాంతి ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ అని చిరు ట్వీట్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
