ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్’ రికార్డు బ్రేక్ చేస్తోంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు రూ.12.20 కోట్లు, రెండో రోజురూ.12.45 కోట్లు, మూడో రోజు రూ.15.50 కోట్లు రాబట్టింది. మొత్తంగా రూ.40.15 కోట్లు వసూలు చేసింది. మరికొద్ది రోజుల్లో 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
