సాధారణంగా అడవులలో ఒక్కోసారి ఎన్నో అరుదైన జంతువులు కనిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా సిక్కింలో అత్యంత అరుదైన టిబెటన్ బ్రౌన్ ఎలుగుబంటిని అధికారులు గుర్తించారు. ఇది ఇండియాలో బయటపడటం ఇదే తొలిసారని సిక్కిం IFS అధికారి ప్రవీణ్ కాశ్వాన్ ఎక్స్‌లో వెల్లడించారు. ఇది 4 వేల మీటర్ల కంటే ఎత్తులో ఉండే ఆల్ఫెైన్ అడవులు, గడ్డి మైదానాలలో నివసిస్తుందని, ఇవి మాంసాహారం, శాకాహారం తింటుందని తెలిపారు
