మన్యం న్యూస్ కరకగూడెం:మండల పరిధిలోని కొత్తగూడెం జి ఎస్.ఎస్ చేర్చి నందు మంగళవారం పినపాక,కరకగూడెం మండలాల జీ ఎస్ ఎస్ లీడర్ పాస్టర్ పండు.సుందర్ రావు,సంస్థ ప్రతినిధులు స్టీవెన్ ఆద్వర్యంలో స్థానిక సర్పంచ్ గొగ్గలి. నాగమణి భర్త నారాయణ చేతుల మీదుగా 200 మంది పిల్లలకు దుప్పట్లు,చలి స్వేటర్లు,బొమ్మలు, సబ్బులు,పేస్ట్, పౌడర్స్ వంటి వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోని గ్రామనికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు, అలాగె గ్రేస్ సర్వీసు సొసైటీ సంస్థ వారకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.