దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘అరుంధతి’ సినిమా విడుదలై నేటికి 15 ఏళ్లు అయింది. ఈ సినిమా 2009లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా ఈ మూవీ హీరోయిన్ అనుష్క శెట్టి ట్వీట్ చేశారు. ‘జేజమ్మ క్యారెక్టర్ ప్రేక్షకుల గుండెల్లో నాకు ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. ఈ ఎపిక్ ఇండియన్ సినిమాను తెరకెక్కించిన కోడి రామకృష్ణ, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, చిత్ర బృందానికి ధన్యవాదాలు’ అని తెలిపారు
