అయోధ్యలో ఈనెల 22న రామమందిర ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ మహోన్నత వేడుకకు హాజరు కావాలంటూ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం అందుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వాన పత్రిక అందజేసింది. కాగా, ఇప్పటికే మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనికి అయోధ్య నుంచి ఆహ్వానాలు అందాయి.
