కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన ‘నా సామిరంగ’ సక్సెల్ టాక్‌తో దూసుకుపోతోంది. డైరెక్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న థియేటర్లలో రిలీజైంది. ఇక ఈ చిత్రం మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రెండు రోజుల్లో రూ.17.8 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంక్రాంతి రేస్‌లో నిలిచింది. ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు
