స్టార్ హీరోయిన్ సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. తమిళ చిత్రంలో కథానాయికగా పరిచయమైన పూజా ఆ తర్వాత నటించలేదు. ప్రస్తుతం సోషల్ వర్కర్‌గా పనిచేస్తోంది. తాను వినీత్‌ను ఇష్టపడుతున్నానని, కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేస్తూ అతడి ఫోటోను షేర్ చేసింది. ‘ఐ లవ్ యూ మై పార్ట్‌నర్’ అంటూ పూజా తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.
