నమీబియా నుంచి తీసుకొచ్చిన మరో చిరుత ‘శౌర్య’ మధ్య భారతదేశంలోని కునో నేషనల్ పార్క్లో మరణించింది. ‘శౌర్య’ చిరుత మంగళవారం తెల్లవారుజామున 3.17 గంటలకు మరణించినట్లు ప్రాజెక్ట్ చిరుత డైరెక్టర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. చిరుత మృతికి గల కారణాలు తెలియరాలేదని తెలిపారు. చిరుతకు పోస్టుమార్టం నిర్వహించి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
