మన్యం న్యూస్ కరకగూడెం:BTPS రైల్వే ట్రాక్ విప్పల సింగారం భూనిర్వాసితులు హైకోర్ట్ W.P.No.10636- 2021 కేసు నందు గ్రామ సభ అనుమతి లేదు అని సంబంధిత భూసేకరణ నోటిఫికేషన్ ను రద్దు చేసినారు. మరియు రైతులు అంగీకరిస్తే వారితో చర్చలు జరపవచ్చును అని 04.10.2023 నాడు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు వాటి అనుసారం అర్డిఓ కార్యాలయం- భద్రాచలం వారు రెండవ సారి అనగా ఈ రోజు చర్చలకు రమ్మని ఇప్పలసింగారం పంచాయతీలోని సోడే సీతమ్మ మరియు 22 మంది బి టి పి ఎస్ రైల్వే ట్రాక్ భూ నిర్వాసితులకు నోటీసు పంపించడంతో ఆర్టీవో కార్యాలయంలో చర్చలకు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు హాజరు అవడం జరిగింది. ఈ చర్చలలో గిరిజన భూనిర్వాసితులు ప్రస్తుత భూమి విలువ ప్రకారం రేటు ఇవ్వాలని, అలాగే భూసేకరణ చట్టం ప్రకారం అర్అర్ ప్యాకేజీ, ఉద్యోగo ఇవ్వాలని,మరియు దీనిలో కోల్పోతున్న భూమికి భూమి, మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని రెండు ప్రధాన డిమాండ్లు ఆర్టీవో గారికి తెలియజేయడం జరిగింది. దీనికి ఆర్డిఓ,జిల్లా కలెక్టర్ అనుమతితో ఈ విషయం మరల తెలియజేస్తామని తెలియజేయడం జరిగింది.
దీనితో 2013 భూ సేకరణ చట్టంలోనే ఇవన్నీ ఉన్నాయని ఏజెన్సీ ఏరియాలో భూసేకరణ చట్టం తప్పనిసరిగా పాటించాలని ఆర్డీవో మరియు ఎంఆర్ఓ అడిగిన ప్రశ్నలకు రైల్వే ట్రాక్ గిరిజన భూనిర్వాసితులు తగిన సాక్ష్యాధారాలను తెలియజేయడంతో చర్చలలో రైల్వే ట్రాక్ భూ నిర్వాసితులు తెలిపిన డిమాండ్లను పై అధికారులకు పంపిస్తాము అని పై అధికారుల నుండి సమాచారం వొచ్చిన పిదప మరల చర్చలకు హజరవగలరని తెలిపినారు. పిటిషనర్లు ఆరోగ్యం సహకరించకున్న ప్రతి సారి భద్రాచలం రావడం జరుగుతుంది. కావున తదుపరి ప్రభుత్వ ప్రతిపాదనలు ఏమైనా ఉంటే విప్పలసింగారం పీసా గ్రామ సభ ముందు ఉంచిన యెడల చర్చించి గ్రామ సభ ఆమోదంతోనే తదుపరి భూసేకరణ ప్రక్రియలు కొనసాగుతాయని చర్చలకు హాజరైన గిరిజన రైతులు స్పష్టం చేశామని తెలిపారు. కావున ఇకనైనా అధికారులు భూసేకరణ చట్టంలో పేర్కొన్న ప్రతి ఒక్క అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, మరియు భూసేకరణ చట్ట ప్రకారం నిర్వాసితులకు రావాల్సిన మెరుగైన నష్టపరిహారం, అర్ & అర్ ప్యాకేజీ, ఉద్యోగం, మరియు భూమికి బదులుగా భూమి ఇవ్వాలని తెలిపారు. ఈ చర్చలలో ప్రధాన పిటిషనర్ సోడే బుచ్చిరాములు , సోడే వేంకటేశ్వర్లు ,సోడే రామచంద్రు, పాల్వంచ నాగేశ్వరరావు, పాల్వంచ శ్రీను, సోడే రవి కుమార్, పాల్వంచ సమ్మయ్య, రాజీవ్ గాంధీ,వజ్జ.నరేష్, రామకృష్ణ, వెంకటమ్మ,మంగతాయారు,బొడమ్మ, మల్లయ్య, మంగతాయి, వాగబోయిన పుల్లయ్య, బండారు కృష్ణ, సురేష్ తదితరులు హాజరయ్యారు.