కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటించిన సైన్స్ ఫిక్షన్ ‘అయలాన్’ తెలుగు వెర్షన్ రిలీజ్‌పై మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 26న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఆర్.రవి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, భాను ప్రియ, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు.
