నందమూరి నటసింహం బాలయ్యపై బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఇంత బాగా డ్యాన్స్ చేస్తున్నానంటే కారణం బాలయ్య. ఆయన చెప్పిన మెలకువలే నన్ను మంచి డ్యాన్సర్‌ని చేశాయి. అల్లరి పిడుగు సినిమా సమయంలో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడే బాలయ్య దగ్గరుండి డ్యాన్స్ నేర్పించారు. డ్యాన్స్‌లో బాలయ్యనే నా గురువు.’ అని అన్నారు.
