‘గుంటూరు కారం’ మూవీకి తొలి రోజు నుంచి మిక్స్డ్ టాక్తో నడుస్తోంది. ఇది కాస్తా బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుందని, టికెట్ల ధరలను తగ్గించాలని చిత్ర బృందం నిర్ణయించింది. రేట్లను తగ్గించడం వల్ల మూవీ కలెక్షన్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. పలు చోట్ల రేపటి నుంచి తగ్గింపు ఉండగా.. కొన్ని చోట్ల శుక్రవారం నుంచి టికెట్ల రేట్లు తగ్గనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ల ధరల తగ్గింపు ఉంటుంది.
