పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ మూవీ బాక్ల్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సందర్భంగా తాజాగా చిత్రబృందం మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. అయితే, ఈ సెలబ్రేషన్స్‌కి అఖిల్ అక్కినేని కూడా హాజరయ్యాడు. దీంతో సలార్ సీక్వెల్‌లో అఖిల్ నటించబోతున్నాడని, అందుకే మూవీ టీంతో ఫస్ట్ పార్ట్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడనే వార్తలు వైరల్ అవుతోన్నాయి. అంతేకాదు, దేవా తమ్ముడి పాత్ర అతడిదే అనే చర్చ కూడా నడుస్తోంది.
