69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు రంగం సిద్ధమయ్యింది. 2023 ఏడాదికి గానూ ఇస్తున్న ఈ అవార్డుల నామినేషన్స్ లిస్ట్ విడుదలైంది. ఇందులో భాగంగా డైరెక్టర్ సందీప్ వంగా రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ మూవీ ఏకంగా 19 కేటగిరిల్లో పోటీపడుతోంది. కాగా, ఈ సినిమాలో తన సూపర్ నటనతో అందరినీ ఆకట్టుకున్న రష్మిక మందన్నా పేరు మాత్రం నామినేట్ కాలేదు.
