మన్యం న్యూస్ గుండాల: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండలం పరిధిలోని సాయనపల్లి గ్రామంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి కార్యక్రమాన్ని టిడిపి మండల అధ్యక్షుడు తోలేం సాంబయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీఆర్ తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని పెంచిన మహనీయుడని అన్నారు. తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలు దాచించిన నాయకుడు అన్నగారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లయ్య, రాములు, లక్ష్మయ్య, బిక్షం, తదితరులు పాల్గొన్నారు