పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సలార్’ హీరోయిన్ శృతి హాసన్ తన కో స్టార్స్ ప్రభాస్, పృథ్వీరాజ్‌ను ఇంటర్య్వూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా తనని రెబల్ స్టార్ అని ఎందుకు అంటారని శృతిహాసన్ ప్రభాస్‌ని ప్రశ్నించింది. తన పెద్దనాన్న కృష్ణంరాజు రెబల్ స్టార్ అని.. అదే పేరును తనకు కొనసాగించారని ప్రభాస్ బదులిచ్చారు
