యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ వచ్చే ఏప్రిల్ 5న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. దాదాపుగా 80 శాతం సినిమా షూటింగ్ పూర్తయిందని సమాచారం. అయితే సినిమా ఆలస్యానికి కారణం అనిరుధ్ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అనిరుధ్ మంచి మ్యూజిక్ ఇస్తున్నా వర్క్ విషయంలో కాస్త ఆలస్యం చేస్తున్నాడని, లేట్‌గా వచ్చినా లేటెస్ట్ మ్యూజిక్ ఇవ్వాలనుకోవడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది.
