కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కాటేర’. డిసెంబర్ 29న కన్నడలో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. తక్కువ టైంలోనే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. తాజాగా ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. అది కూడా నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
