మన్యం న్యూస్ వాజేడు
మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు నరసింహారావు అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంమైన ములుగు జిల్లా వాజేడు మండలం లో ప్రభుత్వ, అసైన్డ్ భూములను గిరిజనేతరులు దొడ్డి దారిన భూ పట్టాలు చేసుకుంటున్నారని, 1/59,1/70 చట్టాలు చట్టాలు అమలులో ఉండగా గిరిజనేతర్లకు పట్టాలు ఏ విధంగా చేస్తున్నారని అక్రమ పట్టాలను తక్షణమే రద్దు చేయాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో బహుళ అంతస్తుల నిర్మాణాలను ఎల్టిఆర్ కేసులు పెట్టి సీజ్ చేయాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో రాధాకృష్ణ, బుల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.