ఢిల్లీలో జరుగనున్న రిపబ్లిక్ డే పరేడ్లో మొత్తం 51 విమానాలతో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇందులో 29 ఫైటర్ విమానాలు, 8 ట్రాన్స్పోర్టు విమానాలు, 13 హెలికాప్టర్లు ఉంటాయని ఐఏఎఫ్ వింగ్ కమాండర్ మనీశ్ తెలిపారు. ఈ సారి సీ-295 కార్గో విమానాన్ని కూడా ప్రదర్శిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళా ఫైటర్ పైలెట్లు, 48 మంది మహిళా అగ్ని వీరులు కూడా పరేడ్లో పాల్గొననున్నారు.
