UPDATES  

 మిర్చిలో అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను రైతులు సాగు చేయాలి…జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…

  • మిర్చిలో అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను రైతులు సాగు చేయాలి……
  •  జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…
  • వివాంట సీడ్స్ జెస్సీ మిరప రకంపై క్షేత్ర ప్రదర్శన

మన్యం న్యూస్, మంగపేట.

మిరప సాగులో అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను రైతులు సాగు చేయాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. శనివారం జిల్లా సరిహద్దు గ్రామమైన పినపాక మండలం దుగినేపల్లి శివారు రెడ్డిగూడెం గ్రామంలో ఆదర్శ రైతు కామిశెట్టి మురళి వ్యవసాయ మిర్చి క్షేత్రంలో

వివాంట సీడ్స్ జెస్సీ మిరప రకము పంట మిర్చి పై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నాసిరెడ్డి సాంబశివరెడ్డి మాట్లాడుతూ వాణిజ్యసరలిలో సాగవుతున్న మిర్చికి మంచి భవిష్యత్తు ఉందని ప్రస్తుత కాలం ప్రతికూల పరిస్థితుల వల్ల దిగుబడి తగ్గిపోయి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వివాంట సీడ్స్ జెస్సీ మిరప రకం చీడ పీడలను తట్టుకొని అధిక పూత,కాతతో అత్యధిక దిగుబడులు రావడం సంతోషకరమైన విషయం అన్నారు చీడ పీడలను తెగుళ్లను తట్టుకొనే అధిక దిగుబడిని ఇచ్చే మిరప వంగడాల రూపకల్పనపై ప్రభుత్వ మరియు ప్రైవేటు సెక్టార్లలో పరిశోధనలు మరింత వేగవంతంగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని సాంబశివరెడ్డి అన్నారు. అనంతరం ఆదర్శ రైతు కామిశెట్టి మురళిని శాలువాతో ఘనంగా సన్మానించి బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో వివాంటా కంపెనీ రీజనల్ మేనేజర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ దుగినేపల్లి పంచాయితీ పరిధిలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన కామిశెట్టి మురళి అనే రైతు మిర్చి పంట అధిక దిగుబడిని ఇచ్చే విధంగా ఉందని వాతావరణ ప్రతికూల పరిస్థితులను సైతం సమర్థవంతంగా తట్టుకోవటం హర్షనీయమన్నారు వచ్చే సంవత్సరం ఈ ప్రాంత రైతులకు తమ వివాంట విత్తన సంస్థ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న కొన్ని రకాల నూతన మిర్చి వంగడాల విత్తనాలను సరఫరా చేస్తూ క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని తెలిపారు రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు వివాంటా సీడ్స్ జెస్సీ మిరప రకం క్షేత్ర సందర్శనకు మంగపేట, పినపాక మండలాలకు చెందిన వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు మిర్చి పంటను పరిశీలించారు. ఈ సంధర్భంగా పంటను పరిశీలించిన సుమారు మూడువందల మందికి పైగా రైతు సోదరులు ఈ సంవత్సరం వివాంట సీడ్స్ జెస్సీ మిర్చి రకము చీడపీడలను,తెగుళ్లను తట్టుకొని అధికపూత, కాయలతో మంచి దిగుబడులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు దేవేందర్, లోకేష్,డిస్ట్రిబ్యూటర్ అవని ఏజెన్సీస్ నవీన్, రాజుపేట శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ ప్రోప్రైటర్ బత్తుల నందకుమార్, బత్తుల ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !