మన్యం న్యూస్ గుండాల: ఆళ్లపల్లి మండలంలో 108 వాహన సంజీవని సేవలు అమోఘం. వాహన సిబ్బంది వాహనంలోనే కాన్పు చేయడంతో పలువురు సిబ్బందిని ప్రశంసించారు. ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన పంబోయిన యశోద కు పురిటి నొప్పులు రావడంతో 108 వాహనానికి సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న వాహనం ఆమని ఆళ్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకువస్తున్న క్రమంలోనే వాహనంలోనే నొప్పులు ఎక్కువ కావడంతో సిబ్బంది కాల్పు చేశారు. యశోదకు మగ శిశువు జన్మించిందని సిబ్బంది భాగ్యమ్మ పేర్కొన్నారు.
