పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్, భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడిపోతున్నారని పుకార్లు వినిపిస్తున్న తరుణంగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. షోయబ్ మాలిక్ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చాడు. శనివారం పెళ్లికి సంబంధించిన ఫోటోలను సనా జావేద్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా, షోయబ్-సానియాకు 2010లో వివాహం జరిగింది.
