మన్యం న్యూస్ గుండాల: జైశ్రీరామ్ నినాదంతో మారుమోగిన గుండాల మండల కేంద్రం. మండల కేంద్రంలోని రాములోరి భక్తులు అయోధ్య రామ మందిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మండల కేంద్రంలోని వీధులన్నీ రామ నామాన్ని జపిస్తూ భారీ ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గుండాల మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు జండా ఊపి ప్రారంభించారు. సోమవారం ప్రాణ ప్రతిష్ట జరిగే అయోధ్య లోని రాములోరి పండుగను మండల కేంద్రంలో కనిపించే విధంగా రామభక్తులు భారీ ఏర్పాటల్లో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో యాసారపు సురేష్, యాసారపు రవి, మానాల శ్రవణ్ కుమార్, మానాల ప్రభాకర్, బత్తిని సాయన్న, దడిగల శ్రీను, మల్లోజి ప్రభాకర్, వల్లోజి సాగర్, తాటిపల్లి సత్యం, బొబ్బిలి నగేష్, వీరన్న, రమేష్, గడ్డం హేమంత్ కుమార్, గామాలపాటి మున్నా, తదితరులు పాల్గొన్నారు