అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ సృష్టించిన సందీప్ రెడ్డి వంగా తాజాగా యానిమల్ చిత్రాన్ని రణబీర్ కపూర్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎట్టకేలకు రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను భారీ ధరకు డిజిటల్ ప్రీమియర్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 26 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
