అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపనకు మరికొన్ని గంటలే సమయం ఉంది. ఈ వేడుకకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వేడుకలో పాల్గొనేందుకు టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం సాయంత్రం అయోధ్యకు చేరుకున్నారు. కాగా, రామమందిర నిర్మాణం కోసం రూ.30 లక్షల విరాళాన్ని పవన్ కళ్యాణ్ అందజేసిన విషయం తెలిసిందే.
