స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఇంట్లో త్వరలో పెళ్లి సందడి షురూ కానుంది. సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ పెళ్లి పీటలెక్కనుంది. ఇటీవల ఆమె తన బాయ్‌ఫ్రెండ్ వినీత్‌ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎంగేజ్మెంట్ అంటూ చేతులకు మెహెందీ పెట్టుకున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాగా ఎంగేజ్మెంట్, పెళ్లి ఎప్పుడు జరుగుతాయో వివరాలు మాత్రం వెల్లడించలేదు.
