డీఫ్ ఫేక్ వీడియో చేసిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ నటి రష్మిక ఈ అంశంపై స్పందిస్తూ హర్షం వ్యక్తం చేసింది. ఢిల్లీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేమతో నన్ను ఆదరించి, అన్ని రకాలుగా అండగా నిలిచేవారు నా చుట్టూ ఉన్నందుకు సంతోషస్తున్నా అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ అని పేర్కొంది.
