మన్యం న్యూస్, మంగపేట.
అయోధ్య లో బాల శ్రీ రాముడి విగ్రహం కు ప్రాణ ప్రతిష్ట సందర్బంగా మంగపేట మండలం లోని రాజుపేట గ్రామం రామ భక్తులు, రామ కీర్తనలు, భజనలు, పాటలు, కోలాటలాల కోలాహళం మధ్య శ్రీ రాముడి ఉత్సవ విగ్రహం
తో ఊరేగింపు గా వాడ వాడలు, వీధి వీధులు తిరిగి రామ భక్తులు రామ భక్తిని ప్రజలకు తమ వివిధ కళా రూపాల ద్వారా ప్రదర్శన చేశారు. వేకువ జాము నుండి ప్రజలు భక్తితో నది స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో భజనలో పాల్గొని ఊరేగింపు తో వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. మండలం వ్యాప్తంగా ఉన్న గుళ్లన్ని శ్రీ రామ నామ జపం తో మారు మ్రోగాయి. దేవాలయాలయాలు ఆద్యా త్మిక చింతనతో నిండిపోయాయి