మన్యం న్యూస్ గుండాల:పినపాక నియోజకవర్గం లో దళిత బంధు మంజూరైన లబ్ధిదారులకు తక్షణమే యూనిట్లను పంపిణీ చేయాలని నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు అశోక్ కుమార్ భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆలా ను కలిసి విజ్ఞప్తి చేశారు. సోమవారం లబ్ధిదారులతో కలిసి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం నియోజకవర్గంలో 1100 మందికి దళిత బంధు నిధులను విడుదల చేసి ప్రోసిడింగ్ ఇచ్చిన వాటిని కూడా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడం సరైనది కాదని అన్నారు. మంజూరైన లబ్ధిదారులందరికీ ఈనట్లను అందించాలని కోరారు