మన్యం న్యూస్ గుండాల: ఏ టి ఎఫ్ నూతన గుండాల మండల కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బొల్లి అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా కొరస ఆదినారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కల్తి లక్ష్మీనారాయణ, ప్రచార కార్యదర్శిగా చందు వెంకట్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎట్టి అనురాధ, కోశాధికారిగా వాసం శ్రీరాములను ఎన్నుకున్నట్లు వారు పేర్కొన్నారు. అనంతరం గుండాల మండల విద్యాశాఖ అధికారి పెండేకట్ల కృష్ణయ్య చేతుల మీదుగా ఏటిఎఫ్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ మంజుల, రామేశ్వరి, రామకృష్ణ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు
