మన్యం న్యూస్ గుండాల: గ్రామపంచాయతీ ట్రాక్టర్ పల్టీపడి పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. మండలం పరిధిలోని సాయనపల్లి గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ బొమ్మెర రామ్మూర్తి(30) రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తుండగా ప్రమాదవశాత్తు కల్తీ కొట్టడంతో ట్రాక్టర్ ఇంజన్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. రామ్మూర్తి మృతి చెందడంతో సాయనపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి