బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ కొత్తగా వ్యాపారరంగంలోకి అడుగు పెట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తానే స్వయంగా తెలిపింది. ఇప్పటికే పలు వ్యాపారాల్లో డబ్బులు పెట్టుబడి పెడుతున్న ఆమె.. కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఢిల్లీలోని నోయిడాలో సన్నీలియోన్ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి రెస్టారెంట్ స్టార్ట్ చేసింది.
