నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. సాగర్ జలాశయంలో 520 అడుగుల దిగువకు నీటి మట్టం పడిపోయింది. తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, ఏపీలోని ప్రకాశం జిల్లాల్లోని సుమారు ఆరు లక్షల ఎకరాలకు సాగు నీరందించడంతో పాటు హైదరాబాద్ తో సహా వివిధ ప్రాంతాల తాగునీటి అవసరాలను నాగర్జున సాగర్ రిజర్వాయర్ తీరుస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే పంటల దిగుబడి తగ్గడంతో పాటు హైదరాబాద్ లో తాగునీటి ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
