మన్యం న్యూస్, మంగపేట.
ప్రవేట్ స్కూల్స్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉండాలని మంగపేట మండల జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది.
మంగపేట మండలం కమలాపురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలసహకారంతో 120 మంది పిల్లలకు షూస్ సాక్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిధులుగా మంగపేట తహసీల్దార్, ఏటూరునాగారం సి ఐ, మంగపేట డిప్యూటీ తహసీల్దార్, హై స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చేతుల మీదుగా కమలాపురం స్కూల్ పిల్లలకు దాతల సహకారంతో షూ సాక్స్ లు 40,000 విలువ చేసే మెటీరియల్ పిల్లలకు ఇవ్వడం జరిగింది జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ ప్రధాన కార్యదర్శి, మునిగాల రాకేష్ ఉపాధ్యక్షులు, పుల్లం శెట్టి అజయ్ కుమార్,కస్పా ముకుందం, కార్యదర్శిలు బండపల్లి రవి, ఆత్మకూరి సతీష్ కోశాధికారులు ముప్పారపు రాజు కొండపర్తి నగేష్, ప్రచార కార్యదర్శులు గగ్గూరి మహేష్ , మహమ్మద్ ఇంతియాజ్ గౌరవ సలహాదారులు కోలగోట్ల నరేష్ రెడ్డి , చాదా మల్లయ్య సయ్యద్ బాబా , మీడియా ఇన్ఛార్జి గుగ్గిల సురేష్, జ్వాల చారిటబుల్ సభ్యులు మునిగాల వెంకటేశ్వర్లు,సిద్ధంశెట్టి లక్ష్మణ్ రావ్, వెంకట్ రెడ్డి,శ్రీధర్, కృష్ణ, రాజేష్,రోహిత్, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.