మన్యం న్యూస్ వాజేడు
మండల కేంద్రంలో
కె జి బి వి పాఠశాలలో బుధవారం జాతీయ బాలికల దినోత్సవం అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జి. రమాదేవి జి
సి డి ఓ
బాలికల శారీరక ఎదగుదలను మానసిక ఒత్తిడి ని, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి, జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి , జీవన నైపుణ్యాలు అలవర్చుకోవాలి సూచించారు. విద్య నైపుణ్యాలు అందించడం వల్ల బాలికల హక్కులు రక్షించబడతాయని తెలిపారు. బాలికల సమస్యల పరిష్కారణ కొరకు 1098 ఫోన్ నంబర్ సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సుజాత, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.