దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రామ్’ సినిమా నిర్మాత దీపికాంజలి కీలక ప్రకటన చేశారు. ఈ సినిమాకు సంబంధించి ప్రతి టికెట్ మీద ఐదు రూపాయలు నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు ఇస్తామని ప్రకటించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ మేరకు వెల్లడించారు. కాగా అయ్యల సోమయాజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోంది.