- పెండింగ్ లో ఉన్న సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు
- స్కాలర్ షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కై ఈనెల 29చలో కలెక్టరేట్ ఎదుట అందోళనలకు రాష్ట్ర కమిటీ పిలుపు
- ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి టిఎల్ రవి
- గత ప్రభుత్వం చెప్పిన సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీల పెంపు పై జివో విడుదల చేయాలి.ఎస్ఎఫ్ఐ .
మన్యం న్యూస్ మంగపేట .
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మంగపేట మండల కమిటీ సమావేశం ఎస్ ఎఫ్ ఐ మండల అధ్యక్షులు జాడి యుగేందర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్ ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి,ఎల్ రవి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు విడుదల చేయాలని మాట్లాడుతూ ములుగు జిల్లా మరియు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్ లో వుండే ఎస్సి, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో వుంటు చదువుకుంటున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వం గత సంవత్సరం మార్చి నుంచి విద్యా సంవత్సరం 2023_2024 జనవరి వరకు ఒక్క పైసా కూడా విడుదల చేయకుండా వుండడం వల్ల సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందడం లేదు.కారణం ప్రభుత్వం మెస్ చార్జీలు విడుదల చేయకపోవడం మరో రెండు నెలల్లో ఇంటర్, పరీక్షలు, పదోతరగతి విద్యార్థుల పరీక్షలు జరగబోతున్నాయి.విద్యార్థులందరు ఆరోగ్యం వుండాలంటే అందరికీ నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి .వసతి గృహాల ఎచ్ డబ్ల్యూఓ లు సైతం గత సంవత్సరం నుండి అప్పులు తెచ్చి వసతి గృహాలు నడుపుతున్నారు.చివరికి వారి భార్య మెడలో ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టిన హాస్టల్ నడిపే పరిస్థితి లో లేరు చివరికి ఎచ్ డబ్ల్యూఓ లు సైతం రోడ్డు మీద. పడే అవకాశం ఉంది.కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థుల పక్షాన ఆలోచించి తక్షణమే బకాయిలో వున్నా సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు విడుదల చేయాలని మరియు గత ప్రభుత్వం పెంచుతామని చెప్పిన సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ కాస్మెటిక్స్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి గత సంవత్సరం బకాయి లో వున్నా మెస్ చార్జీలు స్కాలర్ షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కై జనవరి29న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పిలుపు నివ్వడం జరిగింది.
ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి సిద్దు ,బాలు ,రవి తేజ తదితరులు పాల్గొన్నారు