మన్యం న్యూస్ గుండాల:
గత ప్రభుత్వంలో మంజూరైన లబ్ధిదారులందరికీ దళిత బంధు నిధులు విడుదల చేయాలని కోరుతూ దళితులు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టారు. మంజూరైన నిధులు అన్నిటిని విడుదల చేసేంతవరకు నిరసన కార్యక్రమం చేపడతామని అన్నారు.కార్యక్రమంలో ఆళ్లపల్లి మండలం దళిత బంధు నాయకులూ దొడ్డి రాము, కీసరీ బాబూరావు, వానపాకుల భాస్కర్, నిట్ట సుధాకర్, వేమూరి రవి,దొడ్డి సందీప్, అంబోజు శామ్,కిసరి ఉదయ్,కిసరి అంజయ్య, వానపాకుల సత్యం, వానపాకుల నవీన్,దొడ్డి చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు