మన్యం న్యూస్ భద్రాచలం: ఎటపాక మండలం గుండాల సచివాలయంలో పినపల్లి స్కూల్లో, సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు గుండాల ఎంపిటిసి గొంగడి వెంకటరామిరెడ్డి హాజరవడం జరిగింది. స్వాతంత్ర్యం కోసం అమరులైనటువంటి అమరవీరులందరికీ కూడా ముందుగా నివాళులర్పించిన అనంతరం సచివాలయ అధికారి అయిన సెక్రటరీ వెంకటేశ్వరరావు జెండా ఎగర వేశారు. అనంతరం గుండాల ఎంపిటిసి మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల పోరాట ఫలితం వలన మనకో స్వాతంత్రం లభించిందని, స్వాతంత్రం వచ్చేనాటికి మనకి సొంత రాజ్యాంగం లేకపోవడం వలన, భారత దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణం ఏర్పాటయింది. ఈ కమిటీకి అధ్యక్షునిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నియమించడం జరిగింది. ఈ భారత రాజ్యాంగ నిర్మాణానికి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఈ రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చిందని చెప్పి తెలిపారు. ఈ రాజ్యాంగం ప్రపంచ దేశాలలో కెల్లా అతిపెద్ద లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం అని తెలిపారు. మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం ద్వారా మనల్ని మనం పరిపాలించుకోవడం ఆరంభించుకున్న రోజు కాబట్టి దీనికి ఎంత ప్రాధాన్యత అని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి, చిన్నప్పటినుండి తల్లిదండ్రులను గౌరవిస్తూ, గురువులను పూజిస్తూ, చట్టాలను మరియు రాజ్యాంగాన్ని తెలుసుకోవాలని, తెలుసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి, సర్పంచ్ గుండి సీతాలక్ష్మి, ఉప సర్పంచ్ తోట శశి కుమార్, ప్రముఖ న్యాయవాది అవులూరి సత్యనారాయణ, ఎర్రగోళ్ల నరసింహారావు, పెనుపల్లి స్కూల్ హెడ్మాస్టర్ సత్యనారాయణ, సెక్రటరీ వెంకటేశ్వరరావు, సచివాలయ సిబ్బంది, పేరెంట్స్ కమిటీ చైర్మన్, సభ్యులు, స్కూల్ టీచర్లు, రాసాల నరసయ్య, రాసాల, సాయిబాబా, రమేషు స్కూల్ పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.