మన్యం న్యూస్, మంగపేట.
75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగపేట మండలం తెలంగాణ సెంటర్ లో జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన బిఅర్ఎస్ పార్టీ మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య. ఈ కార్యక్రమనీకి ముఖ్య అతిధిగా హాజరైన బీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, సొసైటీ చైర్మన్ తోట రమేష్.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలు లోనికి వచ్చిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు రాజ్యంగ స్ఫూర్తికి అనుగుణంగా,ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా నడుచుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, డైరెక్టర్లు సిద్ధంశెట్టి లక్ష్మణ్, నర్రా శ్రీధర్, సింగారిబోయిన నర్సయ్య, మండల నాయకులు, చిట్టీమల్ల సమ్మయ్య, అన్వర్ అయూబ్, మాజీ మహిళా అధ్యక్షురాలు కాటూరి సుగుణ, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి,తదితరులు పాల్గొన్నారు.