UPDATES  

 ఎందరో త్యాగదనుల ఫలం గణతంత్ర దినోత్సవం..

 

మన్యం న్యూస్, మంగపేట.

 

ఎందరో త్యాగదనుల పలం నేటి గణతంత్ర దినోత్సవ వేడుకలు, ఈ రోజు మనం స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్నాం అంటే ఎంతోమంది బలిదానాల ఫలితం ఈ స్వతంత్ర భారత దేశం అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కినేపల్లి మల్లారం గ్రామపంచాయతీ కార్యాలయం, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు

ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులను, త్యాగమూర్తులను స్మరిస్తూ సెల్యూట్ చేసే రోజు ఇదే అని అమర వీరుల త్యాగాలను గుర్తుతెచ్చుకుంటూ మన గుండెల్లో నిండిన దేశభక్తిని చాటుతూ సగర్వంగా మన భరతమాతకు వందనాలు తెలుపుకుందాం అని సాంబశివరెడ్డి అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిందని

నూతన ప్రభుత్వం పారదర్శక పాలన అందించడాని మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని

ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం,

సమాన అవకాశాలు దక్కాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను ఇప్పటికే

పకడ్బందీగా అమలు చేస్తుంది. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా మిగతా పథకాలైన రైతు

భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు

మహిళలకు మహాలక్ష్మి పథకం

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అనంతరం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఆటల పోటీల్లో గెలిచిన విద్యార్థిని విద్యార్థులకు సాంబశివరెడ్డి బహుమతులను ప్రధానం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !