మన్యం న్యూస్ గుండాల: మండల కేంద్రంతో పాటు మండలంలో ఘనంగా గణతంత్ర వేడుకలను అధికారులు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు తో పాటు ప్రైవేటు పాఠశాలల్లో సైతం గణతంత్ర వేడుకలను నిర్వహించారు. స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రంగ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో సిఐ ఎల్ రవీందర్ జాతీయ జెండాను ఎగరవేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో అట్టహాసంగా మండలంలో నిర్వహించారు
