మన్యం న్యూస్ ప్రతినిధి.
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తల పెట్టవోయ్.
మన భారత దేశం పరాయి పాలనలో కొన్ని శతాబ్దాలు మ్రగ్గింది అటువంటి
భారత దేశం దాస్య శృంఖలాలు చేదించటానికి ఎంతోమంది తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి స్వాతంత్ర్య ఫలాలు అందించారు. దేశం కోసం ఎంతోమంది తమ తుది శ్వాస వరకు పోరాడారు. ఈ రోజు మువ్వన్నెల జెండా పైకి ఎగిరింది అంటే మూడు లక్షల మంది తలలు వాల్చితే త్రివర్ణ పతాకం ఆకాశంలో రెప రెప లాడుతుంది.
త్రివర్ణ పతాకం లో మూడు రంగులు, మూడు రంగుల్లో కాషాయపు రంగు వీరత్వానికి, ధీరత్వానికి, సేవా నిరతికి, త్యాగమయ జీవివితానికి చిహ్నం.
తెలుపు శాంతికి చిహ్నం, నిరాడంబర జీవితానికి ప్రతీక.
ఆకు పచ్చ పౌరుషానికి, ప్రయత్నానికి చైతన్యానికి, పాడి పంటలకు, అభివృద్ధికి సంకేతం.
అశోక చక్రం ధర్మ మార్గానికి సంకేతం, ధర్మం అంటే ధరించేది అని అర్ధం, అంటే మానవ సంబంధాలు బలోపేతం చేస్తూ, సమాజాన్ని చిన్నభిన్నం కాకుండా కాపాడేది అని అర్ధం. అటువంటి భారతదేశానికి దిశ నిర్దేశం కోసం అహర్నిశలు శ్రమించి భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ అభినందనీయులు. అతను రాజ్యాంగం రచించిన తర్వాత ఇన్ని కోట్లమంది ప్రజా స్వామ్యంలో సమాన అవకాశాలు కల్పించారు.సామాన్యులు సైతం దేశ అధ్యక్షులు అవుతున్నారు, ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రి, ఎంఎల్ఏ, ఎంపీ, లు అవుతున్నారు, విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారు, మహిళలు సైతం అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఇటువంటి భారతదేశం లో జన్మించిన ప్రతి ఒక్కరూ మాతృ భూమి ఋణం తీర్చుకోవాలి, ఎంతోమంది మహానుభావులు మాతృ భూమి కోసం ఎంతో శ్రమించినారు, మనం కూడా మన మన మాతృభూమి కోసం మన, మన రంగాల్లో రాణించి ఋణం తీర్చుకుందాం, దేశానికి సేవచేద్దాం, దేశం అభివృద్ధికి పాటు పడదాం.
జైహింద్….
శంకర్ మైపా,
మన్యం న్యూస్ ప్రతినిధి.