మన్యం న్యూస్ చర్ల:
రిపబ్లిక్ డే పురస్కరించుకొని చర్ల డివిజన్ పరిధిలోని సత్యన్నారాయణపురం, ఉంజుపల్లి, పుసుగుప్ప, చెన్నాపురంలో ఉన్న బీసీ క్యాంపుల్లో 81 బెటాలియన్ బీసీ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 81వ బెటాలియన్ కమాండెంట్ శ్రీ మనీష్‌కుమార్ మీనా ఎస్‌ఎన్ పురంలో ఏర్పాటు చేసిన శిబిరంలో జెండాను ఎగురవేసి అధికారులు, సైనికులు, గ్రామస్తులకు మిఠాయిలు పంపిణీ చేశారు. జేటీఎఫ్ శిబిరాలు చెన్నాపురం, ఉంజుపల్లి, పూసుగుప్పలో కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.ఈ సందర్భంగా గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం మిఠాయిలు పంచి, అన్నదానం కార్యక్రమాన్ని 81 బెటాలియన్ నిర్వహించారు.