మన్యం న్యూస్ గుండాల: గుండాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను ఘనంగా సన్మానించిన ఎస్సై కిన్నెర రాజశేఖర్. బదిలీపై వెళుతున్న హెడ్ కానిస్టేబుల్ పుల్లయ్య, శ్రీనివాస్ రావులను శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు అనంతరం ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ ఎంతో ఉత్తమంగా అందరితో కలివిడిగా ఉంటూ విధులు నిర్వహించారని అన్నారు. బదిలీపై వెళ్లిన మా మదిలో ఎప్పటికీ ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
