సంగీత దర్శకుడు ఇళయరాజా కూతురు, గాయని భవతరణి (47) అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. దీంతో భవతరణి మృతి పట్ల సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు ఆమెకు సంతాపం తెలిపారు. ఈ క్రమంలో ఆమె మృతి పట్ల కోలీవుడ్ హీరో విశాల్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యాడు. ‘నేను అభిమానించే ప్రియమైన భవతరణి.. నిన్ను నా స్వంత చెల్లెలిగా మిస్ అవుతున్నాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని’అంటూ పోస్ట్ పెట్టాడు.
